- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అత్యంత నిరుపేదరికంలో మగ్గుతున్న కుటుంబాలను గుర్తించి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేరళ రాష్ట్ర నమూనాలో సర్వే చేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు మంత్రి సీతక్క అప్పగించారు.
ఇప్పటికే ‘తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమం’ (TGILP) కింద 5 జిల్లాల్లోని 8 మండలాల్లో జరిపిన పైలట్ సర్వేలో సుమారు 8 వేల నిరుపేద కుటుంబాలను గుర్తించారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయనున్నారు.
- Advertisement -



