నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. కేవలం ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని వారు పార్టీ మారారనేందుకు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా? లేదా పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది ఇవాళ్టి విచారణలో తేలనుంది. స్పీకర్ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు గట్టెక్కినట్లే. అలా కాదని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్మాసనం మరేదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది ఇటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీంలో తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



