Friday, January 16, 2026
E-PAPER
Homeజాతీయంబీఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

బీఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఇవాళ ఉద‌యం 10గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు మొద‌లైంద‌ని ముంబై, మున్సిపల్ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి భూషణ్ గగ్రాని తెలిపారు. కౌంటింగ్ లో భాగంగా ముంబాయి వ్యాప్తంగా 23 కేంద్రాలు ఏర్పాటు చేశామ‌ని వెల్ల‌డించారు. కౌంటింగ్ కేంద్రాల లేఅవుట్, టేబుల్ ప్లానింగ్, సిబ్బంది నియామకం, సీసీటీవీ నిఘా, లెక్కింపు కోసం, 759 మంది సూపర్‌వైజర్లు, 770 మంది సహాయకులు, 770 మంది క్లాస్ IV ఉద్యోగులు సహా 2,299 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. అన్ని కౌంటింగ్ సిబ్బందికి ముందస్తు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండటానికి పోలీసు శాఖ భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసింది.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2869 స్థానాలకు పోలింగ్ ముగిసిన విష‌యం తెలిసిందే. మొత్తం స్థానాలు 227 కాగా మెజార్టీ స్థానాలు ఉండగా ఈ పీఠం కైవసం చేసుకునేందుకు 114 స్థానాలు అవసరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -