- Advertisement -
- మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
నవతెలంగాణ-చిన్నకోడూరు
యువతకు క్రీడలు ఎంతో అవసరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మండల పరిధిలోని గంగాపూర్ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని కాసేపు అందర్నీ అల్లరించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువకులు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. క్రీడలతో పాటు రాజకీయాలు కూడా అలవర్చుకోవాలన్నారు. యువతరం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నారు. అంతకుముందు పెద్ద కోడూర్ లో వార్డు మెంబర్ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండెల్లి భవాని వేణు,బిఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, ఉమేష్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



