Friday, January 16, 2026
E-PAPER
Homeనిజామాబాద్కార్మిక వ్య‌తిరేక లేబ‌ర్‌కోడ్స్ ప‌త్రుల ద‌గ్ధం

కార్మిక వ్య‌తిరేక లేబ‌ర్‌కోడ్స్ ప‌త్రుల ద‌గ్ధం

- Advertisement -

నవతెలంగాణ-మోపాల్: మోపాల్ మండలం తనకుర్డ్ గ్రామంలో సంయుక్త కిసాన్ మోర్చా ఎస్‌కేఎం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా.. ఏఐ కేఎంఎస్ ఆధ్వర్యంలో పత్రులను కాల్చి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పాల్గొని మాట్లాడుతు.. రైతులు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ ప్రైవేట్ కరణ బిల్లు, విత్తన చట్టం ముసాయిదా బిల్లు, ఉపాధి హామీ జి రాంజీ పథకం, రైతు వ్యతిరేక నాలుగు చట్టాలను, నాలుగు లేబర్ కోడ్స్ బిల్లులకు వ్యతిరేకంగా ప్రజలు ప్రజా ఉద్యమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పూర్ భూజేందర్, ఆడికే పుష్ప, కంపల్లి ఉమారాణి, పరమేష్, గంగారాం, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -