Friday, January 16, 2026
E-PAPER
Homeమెదక్హరిదాసు వేషధారణతో గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం

హరిదాసు వేషధారణతో గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం

- Advertisement -


నవతెలంగాణ-కోహెడ: మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో హరిదాసు వేషధారణతో.. గడప గడపకు తిరుగుతూ సంప్రదాయ కళలను ప్రజలకు గుర్తు చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిదాసు వేషధారణలో పాల్గొన్న కరెడ్ల రవీందర్ రెడ్డి గ్రామ ప్రజల సహాయంతో సేకరించిన రూ.4 వేలను హనుమాన్ దేవాలయ హుండీలో సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోలు శ్రీనివాస్ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న సంప్రదాయ కళలను నేటి తరానికి పరిచయం చేస్తూ, రాబోయే రోజుల్లో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వేముల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -