నవతెలంగాణ-గోవిందరావుపేట: బహుజనులకు సమన్యాయం కొరకై బిఎస్పి ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య జంపయ్య ఓట్లను అభ్యర్థించారు. మంగళవారం మండలంలోని దుంపెల్లి గూడెం ఎల్బీనగర్ రాంనగర్ గ్రామాల్లో బి.ఎస్.పి కార్యకర్తలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బి.ఎస్.పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన భూక్య జంపయ్య దుంపలగూడెం గ్రామానికి చెందిన పోరిక శివరాం నాయక్ కుమార్తె సారబ్బ కుమారుడు కావడం ఎస్టి బంజారాలో ఉన్న వాళ్లలో సగానికి పైగా బంధువులే ఉండడం జంపయ్యకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఈ సందర్భంగా జంపయ్య మాట్లాడుతూ తను చిన్నతనం నుంచి ఈ ఏరియాలో తిరిగానని సమస్యలు తనకు తెలుసని సమస్యల పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. యువకుడిగా విద్యావంతునిగా అందరికీ సుపరిచితుడుగా ఉన్న తనను ఆదరించి ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు.