– సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్
నవతెలంగాణ -ముధోల్ : అంధత్వ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ అన్నారు.ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో బోస్లే గోపాలరావు పటేల్ కంటిదవాఖన ముధోల్ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటికి సర్వే నిర్వహించి కంటి సమస్యలతో బాధపడుతున్న రోగులను వైద్యులు గుర్తించారు. వృద్ధులకు ప్రత్యేక హోం కేర్ సర్వీస్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి,అవసరమైన వారికి కంటి ఆపరేషన్ల నిమిత్తం వైద్య కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. కంటి దవాఖానా వారు ఉచితంగా రోగులకు వైద్య సేవలు అందించడం అభినందనీయం అన్నారు. ప్రతి ఒక్కరు కంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ సావిత్రి కోటయ్య , నాయకులు అనిల్,చిన్న ముత్యం, ఆసుపత్రి సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
అంధత్వ నిర్మూలనకు కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



