Friday, January 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలురిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా  చేయాలి

రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా  చేయాలి

- Advertisement -

– కలెక్టర్ బి. చంద్రశేఖర్
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా  చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల విషయమై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుకై  జీవో  ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ అన్నారు.మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో ను తప్పనిసరిగా అనుసరించాలని తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లు నిబంధనల ప్రకారం, పారదర్శకంగా అమలు చేయాలన్నారు.గత ఎన్నికల రిజర్వేషన్ డేటా, జనాభా గణాంకాలు, రొటేషన్ విధానం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని వార్డుల వివరాలు, రిజర్వేషన్ పట్టికలను ముందుగానే సిద్ధం చేసి జిల్లా యంత్రాంగానికి సమర్పించాలని, అవసరమైన చోట స్పష్టత కోసం వెంటనే సంప్రదించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సవ్యంగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -