Friday, January 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి పాత బస్టాండ్‌లో ‘ఆరైవ్–ఆలైవ్’ అవగాహనా కార్యక్రమం

కామారెడ్డి పాత బస్టాండ్‌లో ‘ఆరైవ్–ఆలైవ్’ అవగాహనా కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ప్రజలు సురక్షితంగా గమ్యాన్ని చేరాలనే ఉద్దేశంతో శుక్రవారం కామారెడ్డి పాత బస్టాండ్‌లో ‘ఆరైవ్–ఆలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్  ఎం. రాజేష్ చంద్ర  ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఈ అవగాహనా కార్యక్రమం చేపట్టిందనీ పట్టణ సిఐ నరహరి తెలిపారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించవద్దని, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు ఎల్లప్పుడూ సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని, ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు తెలియజేశారు.

ఒక్కసారి ప్రమాదం జరిగితే కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనం నడపాలని పోలీస్ కళాబృందం మాటలు, పాటల రూపంలో ప్రజలను చైతన్యపరిచింది. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషరావు, పీసీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -