Friday, January 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలు4 లేబర్ కోడ్ లు,విత్తన,విద్యుత్,వి బి జీ రామ్ జీ బిల్లులను తక్షణమే రద్దు చేయాలి

4 లేబర్ కోడ్ లు,విత్తన,విద్యుత్,వి బి జీ రామ్ జీ బిల్లులను తక్షణమే రద్దు చేయాలి

- Advertisement -

– కార్మిక సంఘాలు,ఎస్ కే ఎం డిమాండ్
నవతెలంగాణ-ఆలేరు టౌన్ : కార్మిక,రైతు,ప్రజా,గ్రామీణ పేదలను నిరంకుశంగా అణిచివేసే,ఉపాధికి దూరం చేసే అభివృద్ధి నిరోధక బీ జే పీ మోడీ ప్రభుత్వం ముందుకు తెచ్చి అమలుకు పూనుకుంటున్న ప్రజా  వ్యతిరేక బిల్లులను తక్షణమే రద్దు చేయాలని ,భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు)తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.జనార్ధన్ కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శుక్రవారం  ఆలేరు  పట్టణంలో  డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ముందు కార్మిక సంఘాలు,సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్ కే ఎం)లు ఇచ్చిన పిలుపు మేరకు 4 లేబర్ కోడ్ లను,విద్యుత్ సవరణ బిల్లు,విత్తన బిల్లు,ఉపాధి హామీ చట్టం పథకాన్ని రద్దు చేసే బిల్లులను రద్దు చేయాలని నిరసన తెలియజేశారు.

ఈ నిరసన కార్యక్రమానికి అఖిల భారత రైతు.కూలీ సంఘం (ఏ ఐ కె ఎం ఎస్)జిల్లా అద్యక్షులు కల్లెపు అడివయ్య అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం లో రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాలను మోపడం అంటే ఇప్పటివరకు అమలు అవుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడంలో భాగమేనని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం కార్యదర్శి కేమిడి ఉప్పలయ్య,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ లు మాట్లాడుతూ,రైతు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకుని బీ జే పీ మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ఎత్తివేసే కుట్ర పన్నుతుందన్నారు.

సిపిఎం సీనియర్ జిల్లా నాయకుడు మొరిగాడి చంద్రశేఖర్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్ లు మాట్లాడుతూ,కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తేవడం కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టు అని అన్నారు.

విత్తన, విద్యుత్ బిల్లుల మూలంగా రైతులు తమకు నచ్చిన,తమ పొలాల్లో పండే విత్తనాలను ఎంచుకునే హస్కును హరించడంలో కుట్రలో భాగంగా కార్పోరేట్ సంస్థలకు విత్తనాల ఎంపిక,మోటార్ లకు మీటర్లను బిగించే విద్యుత్ సంస్కరణ బిల్లులను  తేవడం అన్యాయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చిర బోయిన రాజయ్య,మామిడాల బాల మల్లేష్,సిపిఎం ఆలేరు పట్టణ కార్యదర్శి ఎం.ఏ.ఎగ్బాల్,ఆయా సంఘాల నాయకులు పిన్నపురెడ్డి రాఘవ రెడ్డి, మొరిగాడి రమేష్,మారుజోడు సిద్దేశ్వర్, సాదుల శ్రీకాంత్, చిర బోయిన కొమురయ్య,కల్లెపు శంకర్, ఇక్కిరి శ్రీనివాస్,వడ్డేమాన్ బాలరాజు,కందుల మధు,బొడ్డు ఆంజనేయులు,గడ్డం మంకయ్య, కుర్రి మార్కండేయ,

గుజ్జ పాండు,పంజాల మురళి,బూశే శ్రీశైలం, మొరిగాడి అశోక్,మడిపల్లి ఉప్పలయ్య,వంగాల నర్సింహారెడ్డి,అయిల యాకయ్య,ఇరుగదిండ్ల వెంకటేష్,తమ్మడి రమేష్,చింతకింది సత్యనారాయణ,కల్లెపు నిశాంత్,చింతకింది సిద్దులు, మొరిగాడి అంజయ్య,నమిలే స్వామి,చిమ్మి అబ్బసాయిలు, కోరుటూరు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -