Friday, January 16, 2026
E-PAPER
Homeఖమ్మంచొప్పకట్లపాలెంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో ఆటల పోటీలు 

చొప్పకట్లపాలెంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో ఆటల పోటీలు 

- Advertisement -

నవతెలంగాణ-బోనకల్ : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని చొప్పకట్లపాలెంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. అనంతరం గురువారం రాత్రి బహుమతి ప్రధానోత్సవ సభ నిర్వహించారు.డివైఎఫ్ఐ అధ్యక్షులు దారిల్లి ఆంజనేయులు అధ్యక్షతన సభ నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కాటేపల్లి అశ్విని, మాజీ సర్పంచ్ బూసి వెంకటేశ్వర్లు,

పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరినీ ఐక్యం చేసే విధంగా క్రీడా పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. సంక్రాంతి పండుగ అనేది ప్రధానంగా మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైందన్నారు. వివిధ రంగాలలో సేవలందించిన వారిని శాలువాలతో సన్మానించారు.

ఉత్తమ విద్యార్థి బోయిన రక్షిత, ఉత్తమ రైతు తన్నీరు కిషోర్, ఉత్తమ పాడి పంటల రైతు బోయినపల్లి ఇందిర, రక్తదానం నిర్వహణ లో బోయినపల్లి పవన్ కుమార్, నేత్రదానం చేపించడంలో చలమల అజయ్ కుమార్, పూల సాగులో  రైతు బాలు మనోహర్, పకృతి వ్యవసాయంలో రైతు ఏడునూతల రామ కోటేశ్వరరావు లను శాలువాలతో సన్మానించారు.

 అనంతరం క్రీడాకారుల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు బోయినపల్లి లక్ష్మి, పంచాయతీ పాలకవర్గ సభ్యురాలు మార్కపుడి రజిని, కొండేటి అప్పారావు, బట్టు గోపాలరావు, వేషాల నాగరాజు, నల్లమోతు సాయికుమార్, కొండేటి ప్రవీణ్, ఉన్నం వెంకటేశ్వర్లు, బొప్పాల రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -