Friday, January 16, 2026
E-PAPER
Homeఖమ్మంపూర్తిగా కాలిపోయిన టీవీ మెకానిక్ షాపు 

పూర్తిగా కాలిపోయిన టీవీ మెకానిక్ షాపు 

- Advertisement -

– రూ. లక్ష రూపాయల ఆస్తి నష్టం 
నవతెలంగాణ – బోనకల్ : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్  మండల పరిధిలోనే జానకిపురం గ్రామంలో టీవీ మెకానిక్ షాప్ శుక్రవారం పూర్తిగా కాలిపోయింది. దీంతో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు టీవీ మెకానిక్ షాప్ యజమాని కంసాని వెంకటనారాయణ తెలిపారు. బాధితుడు వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన కంసాని వెంకటనారాయణ జానకిపురం గ్రామంలో టీవీ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే ప్రతిరోజు లాగే శుక్రవారం కూడా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో షాపు బంద్ చేసి నారాయణపురం భోజనం కోసం వెళ్ళాడు. అయితే భోజనం చేస్తుండగా 1.15 గంటల సమయంలో స్థానికులు, చుట్టుపక్కల వారు షాప్ నుంచి పొగలు వస్తున్నాయని తనకు ఫోన్ చేసినట్లు తెలిపారు. వెంటనే షాపు వద్దకు వెళ్లినట్లు తెలిపాడు. షాపు షట్టర్ తీయగా లోపల పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దీంతో స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో మధిర ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో మధిర నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. అయితే మంటలు చెలరేగటానికి కారణం మీటరు కాలిపోయి ఆ మంటలు షాపు మొత్తం వ్యాపించినట్లు వెంకటనారాయణ తెలిపారు. షాపులో గల మొత్తం పాత టీవీలు, కొత్తగా రిపేరుకు వచ్చినవి కొన్ని, కొత్తగా టీవీలకు వేయటానికి తీసుకువచ్చిన సామాన్లు మొత్తం కాలిపోయినట్లు తెలిపారు. మంటల్లో కాలిపోయిన ఆస్తి విలువ సుమారు ఒక లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. సంఘటన విషయం తెలిసి స్థానిక పోలీసులు కూడా సంఘటన స్థలాన్ని సందర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -