Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలలో సందడిగా సంక్రాంతి సంబరాలు

గ్రామాలలో సందడిగా సంక్రాంతి సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్ : సంక్రాంతి పండగను పురస్కరించుకొని రాయపోల్ మండల పరిధిలో అన్ని గ్రామాలలో ప్రజలందరూ ఉల్లాసంగా సంతోషంగా నిర్వహించుకున్నారు. సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా మూడు రోజులు నిర్వహిస్తారు.బుధవారం భోగి, గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమగా మూడు రోజులు పండుగను నిర్వహిస్తారు. సంక్రాంతి ప్రత్యేకంగా మహిళలు ఇల్లంతా శుభ్రం చేసి సుందరంగా ముస్తాబు చేసి తెల్లవారుజామున ఇళ్ళ ముందు వాకిట్లో రంగురంగుల ముగ్గులను ఆకర్షణీయంగా వేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇంటిల్లిపాది నూతన వస్త్రాలను ధరించి ప్రత్యేకంగా పిండి వంటలను చేసి కుటుంబ సభ్యులందరితో ఉల్లాసంగా భోజనం చేస్తారు. పిల్లలు, యువకులు సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందంగా ఆడుకుంటారు. గాలిపటాలకు ప్రత్యేకత సంక్రాంతి పండుగ. హిందూ సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి పండగను చాలా ఘనంగా నిర్వహించుకుంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -