Friday, January 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బయన్నగుండ్ల జాతర ఉత్సవాలు

ఘనంగా బయన్నగుండ్ల జాతర ఉత్సవాలు

- Advertisement -

– మూడు రోజులపాటు ఉత్సవాలు
నవతెలంగాణ – రాయపోల్ :  పురాతన కాలం నుంచి వస్తున్న సంక్రాంతి జాతరకు రాయపోల్ మండలం అనాజీపూర్‌ గ్రామంలో మూడు రోజులు ఘనంగా నిర్వహించారు.సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు జాతర నిర్వహించి బోనాలు తీయడం పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్నది. మంతూరుకు వెళ్లే రహదారిపై ఉన్న భయ్యన్న గుండ్ల వద్ద పూర్వ కాలం నుంచే పలు ఆలయాలు ఉన్నాయి. బయ్యన్న స్వామి అక్కడ ఓ బండపై వెలిశారు. పురాతన బద్ది పోచమ్మ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం కూడా ఇక్కడ ఉన్నాయి. ఇటీవల రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయాలను ముస్తాబు చేశారు. ఉత్సవాల్లో భాగంగా భోగి పండుగ బుధవారం గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించనున్నట్లు పురోహితుడు నారాయణస్వామి తెలిపారు. సంక్రాంతి రోజైన గురువారం బయ్యన్న గుండ్ల వద్ద జాతర జరుగుతుంది. సాయంత్రం ఎడ్ల బండ్లను ఊరేగింపుతో ఆలయాల చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. సంక్రాంతి  పండుగ రోజు గ్రామంలో ఉన్న దుర్గామాత ఆలయం వద్ద జాతర జరుగుతుంది. గ్రామంలో ఉన్న ఆలయాల చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహిస్తారు. రాత్రి మహిళలు పెద్ద ఎత్తున బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామంలోని ఆయా ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న గ్రామస్తులు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. అలాగే బంధువుల రాకతో గ్రామం జన సందోహంగా మారనుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -