Friday, January 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ షాక్ తో బీఆర్ఎస్ నాయకుడు మృత్యువాత

విద్యుత్ షాక్ తో బీఆర్ఎస్ నాయకుడు మృత్యువాత

- Advertisement -

– వ్యవసాయ పొలంలో గడ్డి కట్ చేస్తుండగా విద్యుత్ ప్రమాదం
నవతెలంగాణ – రాయపోల్ : ప్రమాదవశత్తు విద్యుత్ షాక్ తో బీఆర్ఎస్ నాయకులు, రైతు మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలం సయ్యద్‌నగర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని సయ్యద్ నగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు,రైతు మహమ్మద్ గౌస్ (33) శుక్రవారం ఉదయం తన వ్యవసాయ పొలానికి వెళ్లి గడ్డి కటింగ్ చేసే విద్యుత్ యంత్రంతో పొలంలో గట్ల పై గడ్డి కట్ చేస్తుండగా విద్యుత్ స్తంభం నుంచి బోర్ స్టాటర్ డబ్బాకు విద్యుత్ సరఫరా అయ్యే సర్వీస్ తీగకు తగిలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ సంభవించి అక్కడే కుప్పకూలిపోయాడు. ఉదయం పొలం వద్దకు వెళ్ళిన గౌస్ ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు సాయంత్రం పొలం వద్దకు వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడిపోయి ఉన్నాడు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా గౌస్ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఎంతో ఉత్సాహంగా ఉండే గౌస్ ఇలా విద్యుత్ షాక్ తో మృతి చెందడం బాధాకరమని, గ్రామస్తులు పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి సమాచారం పోలీసులకు అందజేయగా సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్ఐ కుంచం మానస తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -