– గోవిందాపురం ఎల్ లో ఐద్వా మహాసభల సందర్భంగా
– ఘనంగా ఆటలు పోటీలు
– ఊరూరు సంక్రాంతి సంబరాలు
నవతెలంగాణ – బోనకల్ : మండలంలోని పలు గ్రామాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటల పోటీలను నిర్వహించారు. గోవిందాపురం ఎల్ గ్రామంలో ఐద్వాజాతీయ మహాసభల సందర్భంగా షటిల్ రన్నింగ్ ముగ్గుల పోటీలను రెండు రోజులపాటు నిర్వహించారు. చొప్పకట్లపాలెం ముష్టికుంట్ల చిరునోముల రావినూతల తదితర గ్రామాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. గోవిందాపురం ఎల్ గ్రామంలో అత్యంత వైభవంగా పోటీలను ఐద్వా, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. విజేతలకు గురువారం రాత్రి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. గోవిందాపురం ఎల్ గ్రామంలో అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో పోటీలు జరిగాయి. విజేతల బహుమతి ప్రధానోత్సవ సభను గురువారం రాత్రి నిర్వహించారు. విజేతలకు ఆ గ్రామ సర్పంచ్ మంద కరుణ, మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, లక్ష్మీపురం సొసైటీ మాజీ చైర్మన్ మాదినేని వీరభద్రరావు, సిపిఎం శాఖా కార్యదర్శులు తమ్మారపు లక్ష్మణరావు, నల్లమోతు వాణి, పొన్నం రాంబాబు కాట,కోటయ్య, తెలంగాణ రైతు సంఘం మాజీ మండల అధ్యక్షుడు కళ్యాణపు శ్రీనివాసరావు ఉపసర్పంచ్ కారంగుల చంద్రయ్య బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు, మాదినేని వీరభద్రరావు, జొన్నలగడ్డ సునీత, మంద కరుణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఐద్వా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించటం, ఈ పోటీలలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా పాల్గొనటం
అభినందనీయమన్నారు. ముగ్గుల పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని చాటుకున్నారన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలను తిలకించటానికి గ్రామస్తులతో పాటు వారి బంధువులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనటం నూతన ఉత్సాహాన్ని నింపింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా, డివైఎఫ్ఐ, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



