Saturday, January 17, 2026
E-PAPER
Homeజాతీయంకదిలే కారులోకి దూకిన అడవి జంతువు నీల్గాయ్‌..చిన్నారి మృతి

కదిలే కారులోకి దూకిన అడవి జంతువు నీల్గాయ్‌..చిన్నారి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం కారులో వెళ్తుండగా.. అడవి జంతువు నీల్గాయ్‌ ఉన్నట్టుండి కారులోకి దూసుకురావడంతో ముందు సీట్లో తల్లి ఒడిలో కూర్చున్న నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గునా ప్రాంతానికి చెందిన సోను జాట్‌ అనే వ్యక్తి సంక్రాంతి పండగను జరుపుకోవడానికి తన భార్య, నాలుగేళ్ల కుమార్తె తాన్యతో కలిసి బుధవారం వారి స్వగ్రామానికి బయల్దేరాడు. బైపాస్‌లోని దోఖంభా ప్రాంతంలో వారు కారులో వెళ్తుండగా.. రెండు నీల్గాయ్‌లు అకస్మాత్తుగా రోడ్డు పైకి వచ్చాయి. సోను అప్రమత్తమయ్యేలోపు వాటిలో ఒకటి కారు అద్దం పగలగొట్టుకుని లోపలికి దూసుకువచ్చింది. దీంతో ముందు సీటులో తల్లి ఒడిలో కూర్చున్న నాలుగేళ్ల తాన్య తలకు నీల్గాయ్‌ కాళ్లు బలంగా తాకడంతో ఆ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కారులో చిక్కుకున్న నీల్గాయ్‌ని బయటకు తీసి, చికిత్స అందిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -