Saturday, January 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్‌ఎస్‌ పోరు బాట పట్టింది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు భారీ శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే.. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

సికింద్రాబాద్‌ జిల్లా సాధన సమితి పేరుతో ర్యాలీకి అనుమతి అడిగారని.. అయితే నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కారణంతో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక బృందాలను మోహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -