నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్-అమెరికాల దౌత్య సంబంధాలు బలపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలె ఇరుదేశాలు కలిసి ఇన్‌స్పైర్డ్ గాంబిట్-2026స పేరుతో సైనిక డ్రీల్ నిర్వహించాయి. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మరోసారి మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ దౌత్య పరంగా విఫలమైంది, స్వయం ప్రకటిత విశ్వగురుగా చెప్పుకునే మోడీ.. ప్రగల్భాల దౌత్యానికి మరో దెబ్బపడిందని ఎద్దేవా చేశారు. ఆ దేశాల సైనిక విన్యాసాలతో భారత్ విదేశాంగ విధానంలో ఘోరంగా విపలమైందని సోషల్ మీడియా ఎక్స్ వేదకగా ధ్వజమెత్తారు. భారత్, పాక్ మధ్య తలెత్తిన యుద్ధాన్ని కూడా తానే ఆపానని ట్రంప్ పదేపదే చెప్పినా..మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందని తెలియజేశారు.
యూఎస్-పాక్ ఆర్మీ డ్రీల్..విశ్వగురుకు దౌత్యానికి మరో దెబ్బ: కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



