- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : షబ్బీపూర్ తండాకు చెందిన మలవత్ సాయికుమార్ (20) అనే యువకుడు ఆత్మహత్య శనివారం ఉదయం చేసుకున్నాడనీ దేవునిపల్లి ఎస్ ఐ రంజిత్ తెలిపారు. మృతుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సాయికుమార్ కుటుంబంలో చిన్నపాటి గొడవ జరగడంతో మనస్తాపం చెంది తండా శివారులోని పుల్చేరుకుంటలో దూకినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న తండావాసులు అతడిని నీటిలో నుంచి బయటకు తీయడం జరిగిందన్నారు. గానీ అప్పటికే సాయికుమార్ మృతి చెందాడు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మృతుడు అవివాహితుడని తెలిపారు
- Advertisement -



