నవతెలంగాణ-హైదరాబాద్: ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అండర్-19 వరల్డ్ కప్లో భాగంగా … బులవాయో వేదికగా భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ప్రాధాన్యతను సంతరించుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ కాస్త ఆలస్యమైంది. వాన ఆగిన తరువాత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాకు ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ జట్టుకు అజిజుల్ హకిమ్ తమిమ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
భారత తుది జట్టు : ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్ర, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ పంగాలియా, ఆర్ఎస్ అంబ్రిష్, కాన్షిక్ చౌహాన్, హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్, ఖిలాన్ పటేల్
బంగ్లాదేశ్ తుది జట్టు : జావెద్ అక్బర్, రిఫత్, అజిజుల్ హకిమ్ తమిమ్ (కెప్టెన్), కలామ్ సిద్దికీ అలీన్, రిజాన్ హౌసన్, ఫరీద్ హసన్ ఫసల్ (వికెట్ కీపర్), సమీఉన్ బసీర్, షేక్ పర్వేజ్ జిబాన్, అల్ పహాద్, సాద్ ఇస్లాం రజిన్, ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్



