- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అప్పుల ఊబి నుండి బయటకు రావడానికి కరీంనగర్ జిల్లాకు చెందిన దంపతులు సామాజిక మాధ్యమాల్లో పురుషులకు వల వేసి రూంకి పిలిపించి ప్రయివేటు వీడియోలు తీస్తున్నారు. ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారు. KRNRకు చెందిన ఓ లారీ వ్యాపారిని బ్లాక్‌మెయిల్ చేసి రూ.13 లక్షలు తీసుకుని.. మరో రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఫోన్, నగదు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇలా సంపాదించిన డబ్బులతో ఆరేపల్లిలో రూ.65 లక్షల విలువైన ప్లాట్, ఫర్నిచర్, రూ.10 లక్షల విలువైన కారును కొన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



