Saturday, January 17, 2026
E-PAPER
Homeజాతీయంఇండోర్‌ క‌లుషిత నీరు బాధితుల‌కు రాహుల్ గాంధీ ప‌రామ‌ర్శ‌

ఇండోర్‌ క‌లుషిత నీరు బాధితుల‌కు రాహుల్ గాంధీ ప‌రామ‌ర్శ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇండోర్‌లో పర్యటిస్తున్నారు. శనివారం రాహుల్ గాంధీ భగీరథపురంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. గాంధీ బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి ఓదార్చారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలుషిత నీరు కారణంగా చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స అందిస్తు్న్నారు.

ఇక రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందుస్తు చర్యగా పోలీసులు మోహరించారు. అంతకముందు ఎయిర్‌పోర్టులో రాహుల్ గాంధీకి ఘనస్వాగతం లభించింది. కాంగ్రెస్ నేతలు విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -