- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి రూ.1284 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జడ్చర్ల నియోజకవర్గంలోని చిట్టబోయినపల్లిలో త్రిపుల్ ఐటీకి భూమిపూజ చేసి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. తమ ప్రభుత్వానికి విద్య, సాగునీరు ప్రధాన ప్రాధాన్యతలని, విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి సీఎం పాలమూరు బిడ్డేనని, 75 ఏళ్ల తర్వాత తాను ముఖ్యమంత్రిని అయ్యానని తెలిపారు.
- Advertisement -



