నవతెలంగాణ-హైదరాబాద్: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) ఎన్నికల ఫలితాలపై ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(UBT) తొలిసారి స్పందించింది. మహారాష్ట్రలో రాజకీయ యుద్ధం ఇంతటితో ముగిసినట్టు కాదని.. మరాఠా ప్రజలకు సముచిత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన(యూబీటీ) ‘ఎక్స్’లో తెలిపింది.
ఎంఎన్ఎస్‌తో కలిసి పోటీ చేసిన శివసేన(యూబీటీ) 65 సీట్లు గెలుచుకుంది. ఎంఎన్‌ఎస్ 6 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 24 సీట్లు, ఇతర పార్టీల్లో ఎఐఎంఐఎం 8 సీట్ల, ఎన్‌సీపీ 3 సీట్లు, సమాజ్‌వాదీ పార్టీ 2 సీట్లు, ఎన్‌సీపీ(శరద్‌చంద్ర పవార్) పార్టీ ఒక సీటు గెలుచుకున్నాయి. బీజేపీ 89 సీట్లు గెలుచుకుంది. బీజేపీ భాగస్వామి పార్టీ అయిన శివసేన(షిండే వర్గం) 29 సీట్లు గెలుచుకుంది. బీజేపీ-శివసేన(షిండే) కలిసి బీఎంసీలో అతిపెద్ద కూటమిగా నిలిచింది.



