నవతెలంగాణ-హైదరాబాద్: జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) శనివారం విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను http://jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్ష, 29 న పేపర్ -2 పరీక్ష జరగనున్నాయి. ప్రస్తుతానికి తొలి నాలుగు రోజుల అడ్మిట్ కార్డులను విడుదల చేయగా, 28, 29 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తర్వాత విడుదల చేయనున్నారు. మొత్తం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.
డౌన్‌లోడ్ చేసుకోండిలా..
jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
హోం పేజీలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2026 సెషన్-1కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది. దాన్ని ప్రింటవుట్ తీసుకోవచ్చు.
కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి.
ఏదైనా సమస్య ఉంటే [email protected] ద్వారా ఎన్‌టీఏకు ఫిర్యాదు చేయొచ్చు.



