- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లోని దారుస్సలాంలో మీడియాతో మాట్లాడుతూ, ఎంఐఎం టికెట్ల కోసం ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలకు ఇప్పటికే సూచనలు ఇచ్చామని, కసరత్తు ప్రారంభమైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం ఖచ్చితంగా బరిలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
- Advertisement -



