Saturday, May 24, 2025
Homeజాతీయంపన్ను వికేంద్రీకరణలో కేర‌ళకు అన్యాయం: పిన‌ర‌యి విజ‌య‌న్

పన్ను వికేంద్రీకరణలో కేర‌ళకు అన్యాయం: పిన‌ర‌యి విజ‌య‌న్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: మ‌రోసారి కేంద్ర నిధుల పంప‌కాలపై ర‌గ‌డ మొదలైంది. పన్ను వికేంద్రీకరణలో రాష్ట్రానికి ఉండాల్సిన హక్కును నిరాకరించారని కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ఆరోపించారు. పన్ను వాటాను న్యాయంగా కేటాయించి ఉంటే.. 2022-23 ఏడాదికి సంబంధించి అద‌నంగా రూ.2,282 కోట్లు, 2023-24 సంవ‌త్సరానికి రూ.2,071 కోట్లు కేంద్రం నుంచి రావాల‌ని వివ‌రించారు. ఆ రెండు ఆర్థిక సంవ‌త్సరాల‌కు సంబంధించి దేశంలోనే అన్నిరాష్ట్రాల కంటే 3.7శాతం అధిక‌ ఆదాయాన్ని కేర‌ళ ఇచ్చింద‌ని, కానీ టాక్స్ వికేంద్రీక‌ర‌ణ‌ కార‌ణంగా ఆరెండు ఆర్థిక సంవ‌త్సరాల‌కు కేంద్రం నుండి కేరళకు వచ్చిన పన్ను వాటా వరుసగా 1.53 శాతం, 1.13 శాతం మాత్రమేనని అన్నారు. కేరళ జనాభా ఆధారంగా రాష్ట్రానికి 2.7శాతం వాటా రావాల్సి వుందని, ఇది అదనపు డిమాండ్‌ కాదని, కేరళకు రావాల్సిన నిజమైన వాటా అని సీఎం చెప్పారు. 2022-23 ఏడాదికి సంబంధించి అద‌నంగా రూ.2,282 కోట్లు, 2023-24 సంవ‌త్సారానికి రూ.2,071 కోట్లు రావాల‌ని మీడియా స‌మావేశంలో సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ చెప్పారు. అదేవిధంగా ఈ ఏడాది న‌వంబ‌ర్ నాటికి పేద‌రికం లేని రాష్ట్రంగా కేర‌ళ అవ‌త‌రించనుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. తిరువనంతపురంలో శుక్రవారం ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ నాలుగవ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అందుకు త‌మ ప్ర‌భుత్వం అవ‌లంభించిన సంక్షేమ ప‌థ‌కాలే కార‌ణ‌మ‌ని ఆయ‌న తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -