Wednesday, May 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రామీణ ప్రాంతాల్లోఉపాధి అవకాశాలు పెంచుతాం

గ్రామీణ ప్రాంతాల్లోఉపాధి అవకాశాలు పెంచుతాం

- Advertisement -

ప్రతి రోజు 15 లక్షల మందికి పని కల్పిస్తాం : పంచాయతీ రాజ్‌ శాఖ సమీక్షలో మంత్రి సీతక్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని దినాలను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉపాధీ హామీ పనుల్లో రోజుకు 9 లక్షల మంది కూలీలు పాల్గొంటున్నారనీ, ఈ సంఖ్యను తక్షణం 15 లక్షలకు పెంచేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు కావాల్సిన అనుమతులు, సాంకేతిక ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేసి మరిన్ని పనిదినాలు సష్టించాలన్నారు. కూలీలకు నిరంతర ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ప్రత్యేక దష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌, మే నెలలకు కేంద్రం మంజూరు చేసిన 6 కోట్ల పనిదినాల్లో, ఏప్రిల్‌లో కోటిన్నర, మే నెలలో పూర్తి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. కూలీలకు వేతనాల చెల్లింపుల విషయంలో కేంద్రంతో సమన్వయం ద్వారా రూ.462 కోట్ల నిధులు విడుదల చేయించామనీ, ఏప్రిల్‌ 15 వరకు పెండింగ్‌ చెల్లింపులు పూర్తయ్యాయని చెప్పారు. పని స్థలాల్లో తాగునీరు, షెడ్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ వంటి కనీస సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.15వ ఆర్థిక సంఘం నిధులను అనుమతించిన పనులకే వినియోగించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్లించిన ఘటనలపై సంబంధిత అధికారులు వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌లో రూ.1,590 కోట్ల విద్యుత్‌ బకాయిలను అత్యవసరంగా చెల్లించాలని సూచించారు. పనితీరు తక్కువగా ఉన్న జనగామ, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, ఖమ్మం జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి, క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి నిర్మాణంలో ఉన్న 5 వేల గ్రామీణ మహిళా భవనాలతో పాటు 46 గోదాముల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 1,900 గ్రామ పంచాయతీ భవనాలు, 1450 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ ప్రత్యేక కార్యదర్శి దానకిశోర్‌, కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌, స్పెషల్‌ కమిషనర్‌ శ్రీలక్ష్మీ, మిషన్‌ భగీరథ జుచీజ కపాకర్‌ రెడ్డి, ఇంజనీరింగ్‌ విభాగం జోగారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -