Sunday, January 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ సుంకాలపై ఈయూ కీల‌క వ్యాఖ్య‌లు

ట్రంప్ సుంకాలపై ఈయూ కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సుంకాలపై యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు శనివారం ఘాటుగా స్పందించాయి. ‘ప్రమాదకరమైన దిగజారుడు మురికి’ సూచిస్తున్నాయని హెచ్చరించాయి. ”సుంకాలు అట్లాంటిక్‌ సంబంధాలను దెబ్బతీస్తాయి. ప్రమాదకరమైన దిగజారుడు పరిస్థితి’ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. యూరప్‌ ఐక్యంగా, సమన్వయంతో మరియు సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉంటుంది” అని యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌, ఇయు కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలు ఎక్స్‌లో పేర్కొన్నారు. ”సుంకాలు యూరప్‌ మరియు అమెరికాలను పేదలుగా మార్చే ప్రమాదం ఉంది. మన ఉమ్మడి శ్రేయస్సును దెబ్బతీస్తుంది. గ్రీన్‌ల్యాండ్‌ భద్రత ప్రమాదంలో ఉంటే, దాన్ని నాటో లోపల పరిష్కరించగలము” అని ఆమె పేర్కొన్నారు. సుంకాల ముప్పును చర్చించడానికి యూరోపియన్‌ యూనియన్‌లోని 27 దేశాల రాయబారులు ఆదివారం అత్యవసరంగా సమావేశం కానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -