- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇండోర్ వేదికగా మూడో వన్డేలో డరిల్ మిచెల్, ఫిలిస్స్ శతకాల మోత మోగించారు. డరిల్ మిచెల్ 106 బంతుల్లో 100 పరుగులు చేశారు. 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో అదరగొట్టాడు. అదే విధంగా సహచర బ్యాటర్ ఫిలిప్స్(100) కూడా 8 ఫోర్లు, 3 సిక్స్‌తో సెంచరీ సాధించాడు. ఇరువురు కలిసి సముచితంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఇద్దరు కలిసి మూడు వికెట్‌కు 185 బంతుల్లో 214 పరుగుల సాధించారు. గత మ్యాచ్‌లో కూడా అద్భుతమైన సెంచరీతో డరిల్ మిచెల్ జట్టుకు విలువైన విజయాన్ని అందించాడు. మొదటి వన్డేలో అర్ధసెంచరీతో రాణించాడు. భారత్ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో డరిల్ మిచెల్ అదరగొడుతున్నాడు.
- Advertisement -



