నవతెలంగాణ-హైదరాబాద్: చివరి వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. డరిల్ మిచెల్, ఫిలిప్స్ శతకాలతో కదంతొక్కడంతో 50 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న భారత్, కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇన్సింగ్స్ ఆరంభంలోనే కివీస్ జట్టు ఓపెనర్ బ్యాట్స్ మెన్స్‌లను టీమిండియా బౌలర్లు ఔట్ చేశారు.
ఆర్షదిప్ సింగ్ వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికే హెచ్ నికోలస్, హర్షిత రాణా వేసిన సెకండ్ ఓవర్‌లో డీపీ కాన్వే పెవిలియన్ చేరాడు. యంగ్ 30పరుగులు చేసి క్యాచ్ అవుటైయ్యాడు. ఆతర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టన్ ఆచితూచి ఆడుతూ ఫిలిప్స్ తో జతకట్టి ఇన్సింగ్స్ ను చక్కదిద్దాడు. ఇద్దరు కలిసి మూడు వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
డరిల్ మిచెల్ 15 ఫోర్లు, 3సిక్స్‌లతో 135 పరుగులతో అదరగొట్టాడు. అదే విధంగా ఫిలిప్స్(108) కూడా 8 ఫోర్లు, 3 సిక్స్‌తో సెంచరీ సాధించాడు. వీరిద్ధరి భాగస్వామ్యాన్ని చాలా ఓవర్ల తర్వాత ఆర్ష్‌దీప్ సింగ్ విడతీశాడు. ఆ తర్వాత వచ్చిన కీవిస్ బ్యాటర్లు స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు. టీమిండియా బౌలర్లు ఆర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా 3 వికెట్లు తీశారు. సిరాజ్, యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ ఇండోర్ వేదికగా చివరిదైన మూడో వన్డే జరుగుతోంది. ఇండోర్ లో హోల్కర్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1 తో సమంగా ఉన్నాయి. ఇండియా గెలిస్తే సీరిస్ కైవసం చేసుకోనుంది.



