నవతెలంగాణ-హైదరాబాద్ : నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులను బలి తీసుకోవడం అత్యంత విషాదకరం అని కవిత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. కోటి బీమా కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేశారే తప్ప విధివిధానాలు ఖరారు చేయలేదని మండిపడ్డారు.
‘ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కష్టపడుతున్నారు వారికి ఉద్యోగ భద్రత లేదు.. సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు.. విధి వక్రించి వారికి ఏదైనా జరిగితే ఆ కుటుంబాలకు కనీస భద్రత లేదు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేజీబీవీ టీచర్లు, ఇతర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.కోటి బీమా సదుపాయం కల్పించాలి సూర్యాపేట జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ టీచర్‌తో పాటు కేజీబీవీ ఎస్ఓ కు రూ. కోటి బీమా అందజేయాలి.. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రూ. కోటి బీమాపై ప్రకటన చేయాలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కల్పన, గీతారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. ప్రమాదంలో గాయపడిన మిగతా ఇద్దరు టీచర్లు కోలుకొని క్షేమంగా బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని కవిత ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.



