- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే అధినేత దళపతి విజయ్ సోమవారం మరోసారి ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. జనవరి 12న విజయ్ మొదటిసారి అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు దాదాపు 7 గంటలపాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. సంక్రాంతి నేపథ్యంలో విజయ్ కోరిక మేరకు తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. కాగా, కరూర్ తొక్కిసలాటలో 41మంది చనిపోయిన విషయం తెలిసిందే.
- Advertisement -



