- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చిలీ దేశంలో గత రెండ్రోజులుగా కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వం ‘స్టేట్ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. శాంటియాగోకు దక్షిణాన ఉన్న నుబుల్, బయోబియో ప్రాంతాల్లో పొడి వాతావరణం వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
- Advertisement -



