- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గ్రీన్‌లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన వేళ.. ఈయూ దేశాలు కౌంటర్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ట్రంప్ సుంకాల ప్రకటన అనంతరం ఈయూ దేశాలు సమావేశమయ్యాయి. అనంతరం ‘ట్రేడ్ బజూక’ ఉపయోగించాల్సిన అవసరం వచ్చిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు వెల్లడించారు. ‘ట్రేడ్ బజూక’ అంటే ఈయూ యేతర దేశాల నుంచి వచ్చే ఆర్థిక ఒత్తిళ్లకు వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉపయోగించే వ్యవస్థ.
- Advertisement -



