Monday, January 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలులక్కీడ్రా పేరుతో మోసం..ఇద్దరు యువకులపై కేసు నమోదు

లక్కీడ్రా పేరుతో మోసం..ఇద్దరు యువకులపై కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: లక్కీడ్రా పేరుతో ప్రజలను మోసం చేయడానికి హైదరాబాద్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం ఎదుట ప్రచార వీడియోలు చిత్రీకరించి, అమాయక భక్తులకు గాలం వేస్తున్న ఇద్దరు యువకులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్‌ క్యాస, సిద్ధమోని నరేందర్‌ అనే యువకులు రూ. 399 చెల్లిస్తే లక్కీడ్రాలో పాల్గొని హ్యుందాయ్‌ ఐ20 కారు, ఐఫోన్‌, టీవీ, బైక్‌ వంటి బహుమతులు గెలుచుకోవచ్చని నమ్మబలికారు. శ్రీఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపకురాలు కరాటే కల్యాణి ఈ మోసాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్న ఈ యువకులు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -