- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ము కశ్మీర్ ఒక్కసారిగా భూకంపంతో ఉలిక్కి పడింది. సోమవారం ఉదయం భూ ప్రకంపనలు లఢాఖ్‌లోని లేహ్‌తో పాటు కశ్మీర్ ప్రజలను వణికించాయి. ఇళ్లలో, కార్యాలయాల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, ఈ భూకంపం ఉదయం 11:51 గంటలకు సంభవించింది. లేహ్ ప్రాంతంలో భూకంపం కేంద్రం నమోదు కాగా.. 171 కిలోమీటర్ల లోతులో భూకంపం పుట్టింది. రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రత నమోదైంది.
- Advertisement -



