మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
నవతెలంగాణ-కుబీర్
ముధోల్ నియోజకవర్గం లో ప్రతి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి వారి సేవలను అందించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి అన్నారు. గురువారం భైంసా మండలంలోని దేగాం గ్రామంలో కుబీర్ మండలంలోని మాలేగాం గ్రామానికి చెందిన లావణ్య ఇటీవల గత కొంత కాలం నుంచి అనరోగ్యం తో బాధపడుతుండగా వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 54 వేల రూపాయల చెక్కును లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి జరుగుతుందని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు, మండల నాయకులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి, రమణారెడ్డి, ఆనంద్ ,గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



