Monday, January 19, 2026
E-PAPER
Homeఆటలుబంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ICC అల్టిమేటం

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ICC అల్టిమేటం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బంగ్లాదేశ్‌లో నెల‌కొన్న‌ రాజ‌కీయ అనిశ్చితల‌ కారణంగా ఆ దేశంలో మైనార్టీలైన హిందువులపై దాడులు నిత్యం కృత్య‌మైన విష‌యం తెలిసిందే. ఆ సంఘ‌ట‌న‌ల‌తో ఇండియా-బంగ్లా దౌత్య సంబంధాల‌పై పెను ప్ర‌భావం చూపింది. యూనిస్ ఖాన్ ప్ర‌భుత్వం మైనార్టీల ప్రాణాల‌కు స‌రైన ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలేద‌ని భార‌త్ స‌ర్కార్ వాపోయింది.

ఈ ఏడాది జ‌రిగే ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ ఆట‌గాళ్ల‌ల‌కు అనుమ‌తి లేద‌ని, కేకేఆర్ టీంలో ఆ దేశ క్రికెట‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మ‌న్‌ను వైదొల‌గించారు. ఇండియా నిర్ణ‌యంతో బంగ్లాలో ఐపీఎల్ ప్ర‌సారాల‌ను నిలిపి వేస్తూ యూనిస్ ఖాన్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో ఆడ‌బోమ‌ని, త‌మ జ‌ట్టు ఆడే వేదిక‌ల‌ను శ్రీ‌లంక‌కు మార్చాల‌ని, భ‌ద్ర‌తా ప‌రంగా భార‌త్‌లో బంగ్లా టీంకు ముప్పుపోంచి ఉంద‌ని ఆ దేశ క్రికెట్ బోర్డు ఐసీసీకి లేఖ‌లో రాసింది. దీంతో బీసీబీ(బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు)తో ఐసీసీ(ఇంట్నేరేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్) ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపింది. టోర్నీ సందర్భంగా అన్ని విధాలుగా బంగ్లా జ‌ట్టుకు భద్ర‌తా క‌ల్పిస్తామ‌ని భ‌రోసా ఇచ్చింది. అయినా కానీ బంగ్లాలో బోర్డు మొండికేసింది.

తాజాగా ఇంట్నేరేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్(ICC) బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB)కు అల్టిమేటం జారీ చేసింది. వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభంకానున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో ఆ దేశ జ‌ట్టు పాల్గొనే విష‌యంపై క్లారిటీ ఇవ్వాల‌ని నోటీసులు జారీ చేసింది. ఒకే వేళ బంగ్లా టీం భార‌త్‌కు రాకుంటే..ఆ జ‌ట్టు స్థానంలో స్కాట్లాండ్ జ‌ట్టును తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. అయితే ఈసారి భార‌త్-శ్రీ‌లంక క‌లిసి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీకి ఆతిథ్య‌మిస్తున్నాయి. వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 7న‌ మోగా టోర్నీ ప్రారంభంకానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -