Monday, January 19, 2026
E-PAPER
Homeజాతీయంయుఎఇ అధ్యక్షుడు భార‌త్‌లో ప‌ర్య‌ట‌న‌

యుఎఇ అధ్యక్షుడు భార‌త్‌లో ప‌ర్య‌ట‌న‌

- Advertisement -

యుఎఇ అధ్యక్షుడు భార‌త్‌లో ప‌ర్య‌ట‌న‌ నేడు యుఎఇ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ భారత పర్యటన కోసం సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు యుఎఇ అధ్యక్షుడు భారత్‌కు చేరుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈరోజు సాయంత్రం మొహమ్మద్‌ బిన్‌, ప్రధాని నరేంద్రమోడీ ఇరువురు నేతలు రెండుగంటలపాటు సమావేశం కానున్నారని, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకోనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. యుఎఇ అధ్యక్షుడి హోదాలో మొహమ్మద్‌ బిన్‌ భారత్‌ మూడవ అధికారిక పర్యటన. 2024 సెప్టెంబర్‌, 2025 ఏప్రిల్‌లో వరుసగా ఆయన భారత్‌లో పర్యటించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గాజాలో శాంతి ప్రణాళిక రెండో దశ ప్రారంభంలో యుఎఇ అధ్యక్షుడు భారత్‌ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -