భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
త్వరలో అదనపు ఎమ్మార్వోల నియామకం : ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల సమీక్షలో మంత్రి పొంగులేటి
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్
ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యాజమానులకు తమ భూమి పై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఇల్లు, భూమి ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పం అని పేర్కొన్నారు. పథకం కింద పేద కుటుంబాలకు వారి సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కొక్క ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. దాదాపు 4 లక్షల ఇండ్లను మంజూరు చేసి, రాష్ట్రవ్యాప్తంగా గహ విప్లవానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
హౌసింగ్, రెవెన్యూ అంశాలపై జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో జరుపుతున్న సమీక్షలో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఇంచార్జీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, గహనిర్మాణ, రెవెన్యూ, ఫారెస్టు అధికారాలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్, వాకాటి శ్రీహరి, జూపల్లి కష్ణారావు, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు జి. చిన్నా రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో క్షేత్ర స్థాయిలోని పరిస్థితులపై స్థానిక ప్రజాప్రతిని ధులతో సమన్వయంతో వ్యవహరిం చాలన్నారు. జిల్లా స్థాయిలో అధికారయంత్రాగమంతా సమన్వయంతో పని చేస్తే అక్కడికక్కడే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వ లక్ష్యాలక నుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం సేకరించి పూర్తి స్థాయిలో వినియోగించకుండా మిగిలి ఉన్న భూముల్లో అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. జిల్లాల్లో గహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరక్టర్లు పూర్తి బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలని కోరారు. లబ్ధిదారులు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
అలాగే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణపు పనులు ఏ స్థాయిలో ఉన్నా ఈ నెల 20 లోపు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని కోరారు. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపాలని సూచించారు. అర్హులైన పేదలనే లబ్ధిదారులగా ఎంపిక చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో, అవసరానికి అనుగుణంగా అదనంగా మరో తహశీల్దార్ ను నియమించనున్నామని తెలిపారు.
ఇందుకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. రెవెన్యూ, అటవీ తదితర శాఖల మధ్య ఉన్నభూ వివాదాల సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం ఆయా విభాగాలు ఉమ్మడిగా సర్వే చేయడమే మార్గమన్నారు. రాష్ట్రంలో భూ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్మెంట్స్ , భూ రికార్డుల శాఖ ద్వారా సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. భూ రికార్డుల్లో పారదర్శకత, కచ్చితత్వం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం కషి చేస్తోందని పేర్కొన్నారు. పేదలకు న్యాయం జరిగేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని అన్నారు.
ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



