నవతెలంగాణ-హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్ ఆక్రమణకు ట్రంప్ సన్నాహాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అందుకు అడ్డుచెప్తుతున్న డెన్మార్క్ తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలపై పది శాతం పన్నులు విధించారు. ట్రంప్ నిర్ణయాన్ని ఈయూ సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా ట్రంప్ సుంకాలపై బ్రిటన్ ప్రధాని ఘాటుగా స్పందించారు. గ్రీన్ ల్యాండ్ ప్రజలదని, డెన్మార్‌కు దానిపై పూర్తి బాధ్యతలు ఉంటాయని చెప్పారు. ట్రంప్ చర్యలతో గ్లోబెల్ శాంతికి విఘాతం కలుగుతుందని మండిపడ్డారు. కూటమి ప్రయోజనాలతో పాటు గ్రీన్‌ల్యాండ్ పరిరక్షణ తమకు ఎంతో ముఖ్యమని తెల్చిచెప్పారు.
ట్రంప్ మొండిగా డెన్మార్క్ మీద దాడి చేస్తే..కూటమి నియమంగా ప్రకారం NATO ద్వారా మా మిత్రదేశాలతో కలిసి పూర్తిగా డెన్మార్క్‌కు సహకరించడానికి బ్రిటన్ సిద్ధంగా ఉందని స్టార్మర్ అన్నారు. గ్రీన్‌ల్యాండ్ ఉన్నతిపై అంతిమ నిర్ణయం ఆ ప్రాంత ప్రజలతో పాటు డెన్మార్క్ దేనని తెల్చిచెప్పారు.



