Monday, January 19, 2026
E-PAPER
Homeబీజినెస్అవార్డ్ గెలిచిన లాంగిట్యూడ్ 77, హైదరాబాద్ లో ఆరంభంతో తన ఉనికి విస్తరణ

అవార్డ్ గెలిచిన లాంగిట్యూడ్ 77, హైదరాబాద్ లో ఆరంభంతో తన ఉనికి విస్తరణ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : లాంగిట్యూడ్ 77, పెర్నాడ్ రికార్డ్ ఇండియా నుండి ఇండియన్ సింగిల్ మాల్ట్, హైదరాబాద్ లో విజయవంతంగా ప్రారంభించింది, తమ సుసంపన్నమైన భారతదేశపు కళాపనితనం మరియు అంతర్జాతీయ నైపుణ్యతతో హైదరాబాద్ కి చెందిన అర్హత కలిగిన విజ్ఞులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ లోని ద తాజ్ ఫలక్ నుమా పాలెస్ లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ఈ విడుదల సంబరం జరిగింది. వాస్తవమైన, సమకాలీన భారతదేశపు విలాసం యొక్క సాటిలేని అనుభవాన్ని అతిథులకు అందిస్తోంది.

తమ సాటిలేని నాణ్యత కోసం అంతర్జాతీయంగా గుర్తించబడిన లాంగిట్యూడ్ 77 ప్రతిష్టాత్మకమైన ప్రశంశలను అందుకుంది. వీటిలో లండన్ స్పిరిట్స్ పోటీలో బంగారు పతకం, ద స్పిరిట్స్ బిజినెస్ మరియు మోండే సెలక్షన్ ద్వారా ద గ్లోబల్ స్పిరిట్స్ మాస్టర్స్ మరియు ద ఇంటర్నేషనల్ వైన్ & స్పిరిట్స్ పోటీలో కాంశ్య పతకం ఉన్నాయి. ఈ అవార్డ్స్ శ్రేష్టత పట్ల బ్రాండ్ యొక్క అచంచలమైన నిబద్ధతను మరియు ప్రపంచంలోని ఉత్తమమైన విస్కీలలో దీని యొక్క పెరుగుతున్న ఖ్యాతిని చూపిస్తున్నాయి. లాంగిట్యూడ్ 77 యొక్క కేంద్రంలో అసాధారణమైన కళాపనితనం యొక్క వారసత్వం ఉంది. షివాస్, గ్లెన్ లివెట్, మరియు జేమ్సన్ వంటి దిగ్గజపు ప్రపంచ పేర్ల వెనక ఉన్న మాస్టర్ విస్కీ తయారీదారులచే రూపొందిన లాంగిట్యూడ్ 77, రెండు శతాబ్దాలకు పైగా విస్కీ తయారీ వారసత్వాన్ని తీసుకుంది. ప్రతి బాటిల్ లో తరతరాలుగా ఉన్న నైపుణ్యం, ఆవిష్కరణ మరియు కళాత్మకతను నింపుతుంది.

ప్రసిద్ధి చెందిన విస్కీ నిపుణుడు జిమ్ ముర్రే మాటల్లో, “ లాంగిట్యూడ్ 77 స్పష్టత, సమతుల్యత మరియు సంక్లిష్టతను శ్రమ లేకుండా నైపుణ్యంతో ప్రదర్శిస్తుంది- ఇది ఉత్తమమైన పనితనానికి నిజమైన ప్రతిబింబం. లిక్విడ్ గోల్డ్ ప్రామాణంలో ఉంటుంది; నా విస్కీ బైబిల్ లో దీనికి 94 పాయింట్లు ఇచ్చి ఉండే వాడిని. ఇది నేను ఎన్నడూ రుచి చూడని కొన్ని ఉత్తమమైన స్కాచ్ బ్లెండ్స్ మరియు సింగిల్ మాల్ట్స్ తో సమానంగా నిలిచింది. నాసిక్ పర్వత శ్రేణుల్లోని సహజమైన ఉష్ణోగ్రత మార్పుల ద్వారా సరైన సమయంలో జరిగిన పరిపక్వత ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. అంతర్జాతీయ విస్కీ పరిస్థితిలో ఈ విస్కీ భారతదేశంలో ఒక గంభీరమైన భాగస్వామిగా అభివృద్ధి చెందడానికి రుజువుగా నిలిచింది మరియు సాటిలేని నాణ్యత, విలక్షణత మరియు నాణ్యతతో స్పిరిట్స్ ను రూపొందించడంలో దేశం యొక్క సామర్థ్యాన్ని చూపిస్తోంది”.

మహేష్ పాటిల్, లాంగిట్యూడ్ 77 యొక్క మాస్టర్ బ్లెండర్ ఇలా అన్నారు, ‘‘అభిరుచి మరియు ఖచ్చితత్వం యొక్క ప్రయాణంతో భారతదేశపు విలక్షణమైన సహజత్వాన్ని వేడుక చేస్తూనే శతాబ్దాలుగా ఉన్న స్వచ్ఛత నైపుణ్యం నుండి లాంగిట్యూడ్ 77ని రూపొందించబడింది. భారతదేశపు సారాంశం నిజంగా గ్రహించే ప్రపంచ స్థాయికి చెందిన సింగిల్ మాల్ట్ ను తయారు చేయడానికి ప్రతి బ్యాచ్ మా నిబద్ధతను సూచిస్తుంది. చల్లని, దిండోరి నాసిక్ పొడి వాతావరణం అమెరికన్ బోర్బన్ పీపాలు మరియు వైన్ కాస్క్స్ లలో సూక్ష్మమైన రెట్టింపు పరిపక్వత ప్రక్రియతో కలపబడింది, లాంగిట్యూడ్ 77ని నిర్వచించే విలక్షణమైన మృదుత్వం మరియు సంక్లిష్టతలను సృష్టించింది. ప్రీమియం కళాపనితనం గురించి నిజంగా అర్థం చేసుకుని మరియు విలువనిచ్చే హైదరాబాద్ నగరంలో విజ్ఞులచే ప్రశంశించబడిన ఈ సాటిలేని లిక్విడ్ ను చూడటం నాకు ఎంతో గర్వంగా ఉంది.”

తాజ్ లో ఈ సాయంత్రం హైదరాబాద్ యొక్క విభిన్నమైన రుచులను చూపించింది, సమకాలీన, ఆవిష్కరణ సమర్పణలు ద్వారా పునః ఊహించబడింది. ప్రత్యేకమైన లాంగిట్యూడ్ 77ని రుచి చూసే అనుభవం, ప్రాంతానికి చెందిన విలక్షణమైన సహజత్వాన్ని వేడుక చేయడంతో ఈ కార్యక్రమం ముగిసింది. భారతదేశంవ్యాప్తంగా లాంగిట్యూడ్ 77 జాగ్రత్తగా ప్రణాళిక చేయబడిన విస్తరణ వ్యూహంలో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగింది. ప్రీమియం విస్కీని వినియోగించే శక్తివంతమైన సంభావ్యత కలిగిన మార్కెట్లపై దృష్టి కేంద్రీకరించింది.

భారతదేశం వెంట వెళ్లే 77° తూర్పు రేఖాంశం పేరు పొందిన, లాంగిట్యూడ్ 77 ఆవిష్కరణ మరియు ప్రపంచ స్థాయికి చెందిన దేశీయ ఉత్పత్తికి పెర్నాడ్ రికార్డ్ ఇండియా వారి నిబద్ధతను చూపిస్తోంది. ఈ ప్రీమియం భారతదేశపు సింగిల్ మాల్ట్ స్థానికంగా సేకరించిన పదార్థాలను ఉపయోగించి చిన్న బ్యాచ్ లుగా రూపొందించబడింది మరియు అమెరికన్ బోర్బన్ పీపాలు మరియు వైన్ కాస్క్స్ లలో రెట్టింపు పరిపక్వం చేయబడింది. నాసిక్ లోని దిండోరి అదనంగా పరిపక్వం చేయబడింది. ఫలితంగా మృదువైన, సుసంపన్నమైన మహోగని స్పిరిట్ కారామెల్, వెనిల్లా మరియు పీట్ పొగ రుచులను కలిగి ఉంటుంది. నీలి రంగులో మ్యాటీ ఫినిష్ పెట్టెలో అందించబడింది- ఇది భారతదేశం ప్రపంచానికి అందించిన రంగుకు సూచిక. బాటిల్ పై ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు వెళ్తున్న 77° రేఖాంశంతో విలక్షణమైన మ్యాప్ స్టాంప్ ఉంది, దీనితో పాటు భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే బ్రాండ్ మానిఫెస్టో కూడా కూడా ఉంది.

లాంగిట్యూడ్ 77 ప్రస్తుతం మహారాష్ట్ర, గోవా, హర్యాణా, ఛంఢీగర్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, దుబాయ్, మరియు ఢిల్లీ మరియు ముంబయిలో పన్నులు లేకుండా లభిస్తోంది. ఇది భారతదేశంవ్యాప్తంగా తన విస్తరణను కొనసాగిస్తున్న కారణంగా, బ్రాండ్ ప్రీమియం, ఉల్లాసభరితమైన అనుభవాన్ని అందించడానికి కట్టుబడింది. విస్కీని అభిమానించే వారి కోసం ఒక కొత్త ప్రామాణం నెలకొల్పుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -