నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఒక హోటల్‌లో బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటనలో ఏడుగురు మరణించారు. చాలా మంది గాయపడినట్లు తాలిబన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం కాబూల్‌లోని షహర్-ఎ-నావ్‌లో ఒక హోటల్‌లో పేలుడు సంభవించినట్లు పేర్కొంది. ఉగ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ స్థానిక విభాగం ఈ పేలుడుకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసింది.
కాగా, సురక్షితమైన, విదేశీ పౌరులు నివసించే షహర్-ఎ-నావ్‌లోని చైనీస్ హోటల్‌లో ఈ పేలుడు జరుగడం కలకలం రేపింది. చాలా మంది మరణించారని, పలువురు గాయపడినట్లు తాలిబాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖానీ ఒక వార్తా సంస్థకు తెలిపారు. మరిన్ని వివరాలు తర్వాత అందజేస్తామని చెప్పారు. అయితే ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలను అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రసారం చేశాయి.



