Saturday, May 9, 2026
E-PAPER
Homeసినిమా'ఐ యామ్ గేమ్` రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఐ యామ్ గేమ్` రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఐ యామ్ గేమ్’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న చిత్రాల్లో ఒకటిగా మారింది. దక్షిణ భారతదేశంలోని 100కి పైగా లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాల గురించి మాట్లాడుతూ,’ నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది అత్యంత స్టైలిష్ ఫిల్మ్. సినిమాలో నా పాత్రతో పాటు మొత్తం వరల్డ్‌ని చాలా మోడర్న్, స్టైలిష్‌గా డిజైన్ చేశారు. దర్శకుడు నహాస్ హిదాయత్ ప్రత్యేకంగా తనని ఓ కొత్త స్టైలిష్ అవతార్‌లో చూపించాలని భావించారు. అదే ఈ ప్రాజెక్ట్‌కు హైలెట్ గా మారింది` అని తెలిపారు. బ్లాక్‌బస్టర్ ‘ఆర్‌డీఎక్స్’ తర్వాత నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మలయాళ సినీ పరిశ్రమలో కూడా అత్యంత పెద్ద రిలీజ్‌లలో ఒకటిగా నిలవనుంది. వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథా రచన అందించారు. ‘లోకా’ వంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత వే ఫారర్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న తదుపరి చిత్రం ఇదే. దుల్కర్ 40వ చిత్రంగా తెరకెక్కుతున్న దీన్ని భారీ స్థాయిలో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -