Tuesday, January 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయండెన్మార్క్‌కు కెన‌డీయ‌న్ సైనికులు

డెన్మార్క్‌కు కెన‌డీయ‌న్ సైనికులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గ్రీన్‌లాండ్‌లో యుద్ధ‌మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. ఆ ప్రాంతానికి ఇప్ప‌టికే యుద్ధ విమానాన్ని అమెరికా ఆర్మీ త‌ర‌లించింది. అదే విధంగా నాటో స‌భ్య‌దేశ‌మైన డెన్మార్క్ కూడా ఆర్మీ ద‌ళాల‌ను పంపుతోంది. మ‌రోవైపు నాటో కూట‌మిలో స‌భ్య‌ దేశాలు డెన్మార్క్‌కు అని విధాలు అండ‌గా ఉంటామ‌ని, ట్రంప్ చ‌ర్య‌ల‌కు త‌గిన విధంగా బుద్ధిచెప్పుతామ‌ని హెచ్చ‌రించాయి. ఈక్ర‌మంలోనే తాజాగా కెన‌డా పీఎం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమెరికాకు దీటుగా త‌మ గ్రీన్‌లాండ్ ప‌రిర‌క్ష‌ణ కోసం కెన‌డీయ‌న్‌ సైనికుల‌ను త‌ర‌లిస్తున్నామ‌ని, నాటో కూట‌మి స‌భ్య‌దేశంగా త‌మ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌హిస్తామ‌ని పీఎం మార్క్ కార్నీ ఉద్ఘాటించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా NORAD విన్యాసాలలో రాయల్ కెనడియన్ వైమానిక దళ బృందం ఇప్పటికే పాల్గొంటుండగా, అవ‌స‌ర‌మైతే అదనపు బలగాలను త‌ర‌లిస్తామ‌ని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ CBC క‌థ‌నాలు వెలువ‌రించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -