Tuesday, January 20, 2026
E-PAPER
Homeజాతీయంశబరిమల ఆలయం మూసివేత..

శబరిమల ఆలయం మూసివేత..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర మంగళవారం ఉదయంతో ముగిసింది. సంప్రదాయబద్ధమైన పూజల అనంతరం ఉదయం 6:45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేశారు.

తాజాగా ఆలయాన్ని మూసివేసినప్పటికీ, నెలవారీ పూజల కోసం ఫిబ్రవరిలో మళ్లీ తెరవనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు కుంభం మాసపు పూజల కోసం ఆలయాన్ని తెరిచి, ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 10 గంటలకు తిరిగి మూసివేస్తారు. ఈ సమయంలో భక్తులు దర్శనానికి రావొచ్చని టీడీబీ స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -