Tuesday, January 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమొబైల్‌లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు.. ఎలుకల మందు తాగిన యువతి

మొబైల్‌లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు.. ఎలుకల మందు తాగిన యువతి

- Advertisement -

నవతెలంగాణ – మెదక్ : నిత్యం మొబైల్ ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దని త‌ల్లిదండ్రులు మంద‌లించినందుకు ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలంలో జ‌రిగింది. ముత్తాయిపల్లి గ్రామానికి చెందిన‌ శిరీష(19) అనే యువతిని తల్లిదండ్రులు మొబైల్‌లో గేమ్స్ ఆడొద్దని మందలించారు. దీంతో మనస్తాపానికి గురై స‌దురు యువతీ ఎలుకల మందు తాగి సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయింది. కూతురి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -